Delhi Police: మోడీ హత్యకు కుట్ర.. మద్యం మత్తులో కాల్
ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని ఢిల్లీ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. ప్రధాని మోడీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా చంపేస్తామంటూ
- Author : Praveen Aluthuru
Date : 21-06-2023 - 2:02 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Police: ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని ఢిల్లీ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. ప్రధాని మోడీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా చంపేస్తామంటూ ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ పోలీసులకు బుధవారం రెండు పిసిఆర్ కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీస్ యంత్రాంగ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయమై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ… ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, కాల్ చేసిన వ్యక్తిని కనుగొనడానికి ఒక బృందాన్ని నియమించామని చెప్పారు.
కాగా పోలీసుల తాజా సమాచారం ప్రకారం నిందితుడు మద్యానికి బానిస అయ్యాడని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. దర్యాప్తులో ఆ వ్యక్తి గత రాత్రి నుండి మద్యం సేవిస్తున్నాడని తేలింది. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి ఇంట్లో లేడని. అతడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ప్రధానిని, ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Read More: Road Accident: అదుపుతప్పి కాలువలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులకు గాయాలు