Fire Broke Out: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం
ఢిల్లీలోని బదర్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Broke Out) జరిగింది. మంటల ధాటికి 2 అంతస్తుల భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్‌లతో మంటలను ఆర్పుతున్నారు.
- Author : Gopichand
Date : 28-03-2023 - 7:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలోని బదర్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Broke Out) జరిగింది. మంటల ధాటికి 2 అంతస్తుల భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్‌లతో మంటలను ఆర్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ADP రాజేష్ శుక్లా తెలిపారు. మంటలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.
#WATCH दिल्ली: बदरपुर के मोलरबंद इलाके में एक 2 मंजिला इमारत में आग लग गई। आग लगने के कुछ देर बाद ही इमारत पूरी तरह से ढह गई, इमारत के भूतल पर एक गोदाम था, जिसमें आग फैल रही है। आग बुझाने का काम जारी है। हादसे में अभी तक किसी के हताहत होने की ख़बर नहीं है। pic.twitter.com/eITF323f4N
— ANI_HindiNews (@AHindinews) March 27, 2023
ఢిల్లీలోని బదర్‌పూర్‌లోని మోలార్‌బాండ్ ప్రాంతంలోని రెండంతస్తుల భవనంలో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే భవనం కూలిపోయింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక గోడౌన్ ఉంది. అందులో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ADP, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ రాజేష్ శుక్లా ప్రకారం.. 18 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు అదుపులోకి వచ్చాయి. అలాగే మంటలను పూర్తిగా ఆర్పేందుకు చెత్తాచెదారాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో ప్రమాదం, మంటలను చూసి చుట్టుపక్కల ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.