HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Delhi Beat Rajasthan Royals By 7 Wickets

DC vs RCB: హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ… కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు

DC vs RCB: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది.

  • By Naresh Kumar Published Date - 11:02 PM, Sat - 6 May 23
  • daily-hunt
Phil Salt Dc
Phil Salt Dc

DC vs RCB: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ధాటిగా ఆడింది. ఓపెనర్లు డుప్లేసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.తన సూపర్ ఫామ్ కొనసాగించిన డుప్లేసిస్ 34 బంతుల్లో 1 సిక్స్ , 5 ఫోర్లతో 45 రన్స్ చేయగా…కోహ్లీ 46 బంతుల్లో 5 ఫోర్లతో 55 రన్స్ చేశాడు.

అయితే మాక్స్ వెల్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో యువ బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ధాటిగా ఆడి కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు , 3 సిక్సర్లతో 54 రన్స్ చేశాడు. దినేష్ కార్తీక్ 11 రన్స్ కే ఔట్ అయినా…లోమ్రోర్ జోరుతో బెంగళూరు మంచి స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.

కాస్త బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఫాంలో లేని ఢిల్లీ ఎలా ఆడుతుంది అన్న అనుమానం మధ్య. ఆ జట్టు ఓపెనర్లు దూకుడుగా తమ ఇన్నింగ్స్ ఆరంభించారు. వార్నర్ , ఫిల్ సాల్ట్ తొలి వికెట్ కు 5.1 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. వార్నర్ 22 రన్స్ కే ఔట్ అయినా…సాల్ట్ , మిచెల్ మార్ష్ మాత్రం రెచ్చిపోయారు. భారీ షాట్లతో బెంగుళూరు బౌలర్లపై విరుచుకు పడ్డారు. ముఖ్యంగా సాల్ట్ వరుస బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

అటు మార్ష్ కూడా ధాటిగా ఆడటంతో సాధించాల్సిన రన్ రేట్ తగ్గిపోయింది. మార్ష్ 26 రన్స్ చేయగా…సాల్ట్ కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు , 6 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. చివర్లో సాల్ట్ ఔట్ అయినా…అప్పటికే ఢిల్లీ విజయం ఖాయమయింది. రొస్కు, అక్షర్ పటేల్ ఢిల్లీ విజయాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ 16.4 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది నాలుగో విజయం.

Also Read: Virat Kohli: చిన్ననాటి కోచ్‌ పాదాలు తాకిన విరాట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DC vs RCB
  • delhi capitals
  • IPL 2023
  • phil salt
  • virat kohli

Related News

Virat Kohli

Virat Kohli: రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ!

విరాట్ కోహ్లీ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన మే 2025లో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Latest News

    • Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా

    • Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !

    • Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు

    • Ind Vs Pak : మళ్లీ పాక్తో తలపడనున్న భారత్

    • Astrology : ఈ వారం దసరా పండుగ వేళ ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు..!

    Trending News

      • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

      • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

      • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

      • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

      • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd