Dead body In Car: పార్కింగ్ చేసిన కారులో డెడ్ బాడీ కలకలం
విజయవాడలోని పటమటలంకలో పార్కింగ్ చేసి ఉన్న కారులో డెడ్‌బాడీ కలకలం రేపుతుంది.
- By Hashtag U Published Date - 10:20 PM, Tue - 3 May 22
విజయవాడలోని పటమటలంకలో పార్కింగ్ చేసి ఉన్న కారులో డెడ్‌బాడీ కలకలం రేపుతుంది. డి మార్ట్ ఎదురుగా ఉన్న విఎంసీ స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన ఉన్న కారులో డెడ్‌బాడీ ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. AP37 BA 5456 ఇండికా కారులో ఉన్న మృతదేహం పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
దాదాపు మూడు రోజుల నుంచి కారు ఇక్కడే ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రధాన రహదారి పై మూడు రోజులుగా కారు రోడ్డు పక్కన ఉన్న గుర్తించడంలో పోలీసులు వైఫల్యం చెందారు. కనీసం నైట్ రౌండ్స్ లో ఉన్న పోలీసులు సైతం గుర్తించక పొడవం పై విమర్శలుయ వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.