TTD: విరాళాలు అందించండి.. వేంకటేశ్వరుడిని దర్శించుకోండి!
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులు వెంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్ కు తక్షణమే విరాళం ఇవ్వడం ద్వారా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
- By Balu J Published Date - 04:20 PM, Thu - 20 January 22

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులు వెంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్ కు తక్షణమే విరాళం ఇవ్వడం ద్వారా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రూ. 10,000 విరాళం అందించి, టిక్కెట్ కోసం రూ. 500 చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విమానాశ్రయంలో ప్రత్యేక టికెట్ జారీ కౌంటర్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఈ సదుపాయం విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడమే కాకుండా.. దాత భక్తులకు అవాంతరాలు లేని దర్శన అనుభవాన్ని సులభతరం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) గత నెలలో విమానాశ్రయంలో కరెంట్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో TTDకి ముందుకు వచ్చింది. త్వరలో శ్రీవాణి ట్రస్టుకు విరాళాలను స్వీకరించి బ్రేక్ దర్శన టిక్కెట్లను అందజేస్తుంది.
బ్లాక్ కు చెక్ పెట్టేందుకు..
కొందరు దళారులు ముఠాగా ఏర్పడి.. తిరుమలకు వచ్చే ప్రయాణికులను టార్గెట్ చేసుకొని, దర్శన టికెట్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఏవో నకిలీవో, ఏవీ ఒరిజినలో తెలియక మోసపోతున్నారు చాలామంది భక్తులు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. విరాళాలు అందించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా టీటీడీ ఆలోచించి.. ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఈ నిర్ణయంతో భక్తులు ఇక ఎయిర్ పోర్ట్ లో దిగగానే.. వెంటనే దర్శన టికెట్స్ పొందవచ్చు.