Jagan : వైసీపీ సర్కార్ విషయంలో తగ్గేదెలా అంటున్న పురందేశ్వరి
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చూపకుండా రూ.10 లక్షల కోట్లు ఖర్చు
- By Sudheer Published Date - 01:38 PM, Thu - 3 August 23

దగ్గుపాటి పురందేశ్వరి వైసీపీ సర్కార్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. వరుస ట్వీట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ వర్గాలు ఓ పక్క మాటలతో దాడి చేస్తున్నప్పటికీ..పక్క ఆధారాలతో ఏపీ అప్పుల లిస్ట్ ను ప్రజల ముందు ఉంచుతున్నారు.
మొన్నటి వరకు పురందేశ్వరి రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టలేదు. అప్పుడప్పుడు వైసీపీ (YCP) సర్కార్ ఫై కామెంట్స్ చేస్తుండేది తప్ప పూర్తిగా ఫోకస్ చేయలేదు. కానీ బిజెపి అధిష్టానం ఎప్పుడైతే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిందో అప్పటినుండి వైసీపీ సర్కార్ ను టార్గెట్ గా చేసింది. అధ్యక్ష పదవి చేపట్టిన రోజే జగన్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం (AP Govt) 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందంటూ సంచలన ఆరోపణలు చేసారు. ఈ ఆరోపణల ఫై వైసీపీ నేతలు పురందేశ్వరి ఫై ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. అయినప్పటికీ ఎక్కడ తగ్గలేదు. అలాగే విమర్శలు, ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు పురందేశ్వరి.
తాజాగా ట్విట్టర్ లో మరో ట్వీట్ చేసారు. ఆరోపణలు కాకుండా కాగ్ రిపోర్టును ముందుపెట్టి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్న తీరును ఆమె ప్రశ్నించారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే (2020-2021) ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చూపకుండా రూ.10 లక్షల కోట్లు ఖర్చు, అనధికారికంగా చేసారని కాగ్ తప్పు పట్టిందని పురందేశ్వరి తెలిపారు. ఇవి ప్రజల దగ్గర మద్యం అని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, ఉద్యోగుల GPS NPS PF లు మరియు గ్రామ పంచాయతీ నిధులు దారి మరల్చినవి కావా? అని ప్రశ్నించారు. ఇదే కదా నేను చెప్పినది. సీఎం గారూ (CM Jagan), దీనికి మీ సమాధానం ఏంటి అని గట్టిగా డిమాండ్ చేసారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.
కేవలం ఒక్క సంవత్సరంలోనే (2020- 2021) ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చూపకుండా 1.10 లక్షల కోట్లు ఖర్చు, అనధికారికంగా చేసారని CAG తప్పు పట్టింది. ఇవి ప్రజల దగ్గర మద్యం అని , కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, ఉద్యోగుల GPS NPS PF లు మరియు గ్రామ పంచాయతీ నిధులు దారి మరల్చినవి… pic.twitter.com/wxWwmzxrm2
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) August 3, 2023
Read Also : Andhra Pradesh : దసరా నాటికి వైజాగ్ వాసుల కలలు నెరవేరుతాయి – మంత్రి అమర్‌నాథ్