Cylinder Rates: సామాన్యులకు గుడ్ న్యూస్…భారీగా తగ్గిన సిలిండర్ ధరలు.. ఎంతంటే!!
నేడు సెప్టెంబర్ 1వ తేది. సామాన్యులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.
- By hashtagu Published Date - 07:57 AM, Thu - 1 September 22

నేడు సెప్టెంబర్ 1వ తేది. సామాన్యులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. LPG19కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. ఎల్పీజీ 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 91.5 రూపాయలకు తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ప్రతినెలా 1వ తేదీని సిలిండర్ ధరలు కంపెనీలు సవరిస్తాయన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయిల్ కంపెనీలు ధరలను సవరించాయి. తాజాగా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా 1885 రూపాయలకు చేరింది. హైదరాబాద్ లో 2099.5రూపాయలు ఉండగా…విజయవాడలో 2034లకు చేరింది. వైజాగ్ లో 1953 రూపాయలుగా నమోదు అయ్యింది. 14.2 కిలోల గృహవసరాలకు సంబంధించి ఎలాంటి మార్పు చేయలేవు ఆయిల్ కంపెనీలు. వారికి నిరాశే మిగిలింది.