CSK First Win: చెన్నై గెలిచింది…
ఐపీఎల్ 15వ సీజన్‌లో ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ కొట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని రుచి చేసింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 11:31 PM, Tue - 12 April 22

ఐపీఎల్ 15వ సీజన్‌లో ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ కొట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని రుచి చేసింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి సరైన ఆరంభం దక్కలేదు. 36 పరుగులకే రుతురాజ్ గైక్వాడ్ , మొయిన్ అలీ వికెట్లు చేజార్చుకుంది. పవర్ ప్లేలో ఆ జట్టు చేసింది 35 పరుగులు మాత్రమే. ఈ దశలో రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరు బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. సిక్సర్లు కొట్టడంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 17 సిక్సర్లు బాదడం విశేషం. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 11 ఓవర్లలోనే 165 పరుగులు జోడించారు. చివరి రాబిన్ ఊతప్ప 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 88 పరుగులు చేయగా… దూబే 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగ 2 , హ్యాజిల్‌వుడ్ 1 వికెట్ పడగొట్టారు. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 883 పరుగులు సాధించిందంటే వీరి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు ఆరంభం నుంచే తడబడింది. అంచనాలు పెట్టుకున్న డుప్లెసిస్ , కోహ్లీ , అనూజ్ రావత్ నిరాశ^పరిచారు. డుప్లెసిస్ 8, రావత్ 12 , కోహ్లీ 1 పరుగుకే ఔటయ్యారు. తర్వాత మాక్స్‌వెల్ , షాబాజ్ అహ్మద్ ఎదురుదాడికి దిగినా చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. మాక్స్‌వెల్ భారీ షాట్లు కొట్టి ఊపుమీద కనిపించినా… 26 రన్స్‌కు ఔటయ్యాడు. షాబాద్ 27 బంతుల్లో 41, ప్రభుదేశాయ్ 18 బంతుల్లో 34 రన్స్ చేసినప్పటకీ ఫలితం లేకపోయింది. తర్వాత దినేశ్ కార్తీక్ ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో పాటు సహచరుల నుంచి సపోర్ట్ లేకపోవడంతో బెంగళూరుకు నిరాశే మిగిలింది. చెన్నై బౌలర్లలో తీక్షణ 4 , జడేజా 3 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇదే తొలి విజయం. మరోవైపు బెంగళూరుకు ఇది రెండో ఓటమి.
Photo Courtesy- Twitter/CSK
The Jadeja catch celebration 👌👌#TATAIPL #CSKvRCB pic.twitter.com/u3zvE59I3k
— IndianPremierLeague (@IPL) April 12, 2022