Corona Virus: ఇండియలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
- Author : HashtagU Desk
Date : 25-02-2022 - 1:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దేశంలో కరోనా కారణంగా 302 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్ని ఒక్కరోజే భారత్‌లో 26,988 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసులతో కలిపి, దేశంలో ఇప్పటి వరకు 4,28,94,345 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
భారత్‌లో ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,13,226 మంది మృతి చెందగా 4,22,46,884 మంది కరోనా నుండి కోలుకున్నారని, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 1,76,86,89,266 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 32,04,426 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు వాడగా, ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 176,86,89,266 డోసుల వ్యాక్సిన్లు వాడారు. ఇక దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది.