Corona: భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా 1,07,474 కేసులు నమోదు..
దేశంలో కరోనా థర్డ్ వేవ్ క్రమ క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి.
- By Hashtag U Published Date - 02:58 PM, Sun - 6 February 22
దేశంలో కరోనా థర్డ్ వేవ్ క్రమ క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి. అయితే నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,07,474 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,21,88,138 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 12,25,011 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.90 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 865 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,01,979 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,13,246 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,04,61,148 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,69,46,26,697 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 45,10,770 కరోనా వ్యాక్సిన్లు వేసింది సర్కార్.