TTD: అటవీ జంతువుల కదలికలపై ఎప్పటి కప్పుడు నిఘా: టీటీడీ ఈవో
అలిపిరిలో విశ్రాంతి మండపం పునః నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు TTD EO ధర్మారెడ్డి తెలిపారు.
- By Balu J Published Date - 04:48 PM, Thu - 5 October 23
అలిపిరిలో విశ్రాంతి మండపం పునః నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు TTD EO ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండప ప్రాంతంలో పర్యటించిన ఆయన… ధర్మారెడ్డి పర్యటించి కాలినడకన వెళ్ళే భక్తులు సేద తీరే విశ్రాంతి మండపం కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని తెలిపారు. కాలినడక మార్గంలో కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు. అటవీ జంతువుల కదలికలపై ఎప్పటి కప్పుడు నిఘా ఉంచామని.. C.C కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read: Gadar 2: ఓటీటీలోకి గదర్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే