Komatireddy Venkat Reddy: రేవంత్ మొహం చూడను!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.
- By Balu J Updated On - 05:36 PM, Fri - 5 August 22

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యవహరం రచ్చ రేపితే.. తాజాగా చెరుకు సుధాకర్ వ్యవహరం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ వేదికగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడైన చెరుకు సుధాకర్ తన పార్టీని రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ వ్యవహరంపై టీకాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ పై మండిపడ్డారు. తనను సంప్రదించకుండా చెరుకు సుధాకర్ ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. చెరుకు సుధాకర్ గతంలో తనను ఓడించేందుకు పనిచేశాడని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారని మీడియా ముందు మండిపడ్డారు.
కాగా శుక్రవారం మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమావేశం విషయమై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెజ్ జెండా ఎగురవేయడం ఖాయమని, రాజగోపాల్ రెడ్డితో ఏ చర్చకైనా సిద్ధమని బహిరంగా ప్రకటించాడు. ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. మునుగోడు ఉప ఎన్నికకు చాలా సమయం ఉందనీ, తాను ఢిల్లిలో బీజీగా ఉన్నానని, మునుగోడు సభకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాగా కోమటిరెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కానున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ సైతం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో టీకాంగ్రెస్ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.
Related News

Munugodu Elections : మునుగోడులో `సామాజిక` ముసలం
మునుగోడు కేంద్రంగా అభ్యర్థిత్వాల `రేస్` సామాజిక స్లోగన్ దిశగా వెళుతోంది. ఇలాంటి పరిణామం అధికారంలోని టీఆర్ఎస్ పార్టీ తలనొప్పిగా మారింది. ఎవరికి వారే తమ సామాజికవర్గాల నేతలకు అభ్యర్థిత్వాన్ని ప్రోమోట్ చేస్తూ మునుగోడు టీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారు.