Congress Party: దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు కరెంట్ బిల్ కట్టేందుకు కూడా డబ్బులేవా?
- By Latha Suma Published Date - 12:56 PM, Fri - 16 February 24

Electricity-Bills : దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రస్తుతం కరెంట్ బిల్(electricity-bill) కట్టేందుకు కూడా డబ్బుల్లేక విలవిలలాడుతోంది.. స్వయంగా ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్(Ajay Maken)ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పార్టీకి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాకెన్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేయించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల అనధికారిక ఆదేశాలతోనే ఆదాయపన్ను శాఖ అధికారులు తమ పార్టీ ఖాతాలను సీజ్ చేశారని విమర్శిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ విషయంపై తాము ఆదాయపన్ను శాఖ ట్రిబ్యులేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా జరిగిన చర్య ఇదని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అంతరించిపోయిందని, తమ పార్టీ మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ(BJP)ఇలాంటి నియంతృత్వ పోకడలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ తీరుపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, న్యాయ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరును మీడియా సాయంతో ప్రజల్లోకి తీసుకెళతామని మాకెన్ వివరించారు. బ్యాంకు ఖాతాలను సీజ్(Seize bank accounts)చేయడంతో ఆఫీసు కరెంట్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి లేదని మాకెన్ తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘న్యాయ్ యాత్ర’ పైనా దీని ప్రభావం పడుతుందని చెప్పారు.
READ ALSO : RBI : పేటీఎం ఎఫెక్ట్.. మరిన్ని సంస్థలపై ఆర్బీఐ ఫోకస్
కాగా, ఆదాయపన్ను చెల్లించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు ఇన్ కంట్యాక్స్ డిపార్ట్ మెంట్ వివరించింది. రూ. 210 కోట్ల పన్ను పన్ను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారమే పార్టీ ఖాతాలను సీజ్ చేసినట్లు పేర్కొంది.