Kerala : కేరళలో ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.. ఇద్దరికి గాయాలు
కేరళలోని కన్నూర్‌లో కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మధ్య ఘర్ణణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలైయ్యాయి. కేరళలోని
- Author : Prasad
Date : 16-01-2023 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
కేరళలోని కన్నూర్‌లో కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మధ్య ఘర్ణణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలైయ్యాయి. కేరళలోని కన్నూర్‌లో కాంగ్రెస్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తలు పన్నన్నూరులో తీరా మహోత్సవంలో ఘర్షణ చోటుచేసుకుంది. కార్యక్రమం నిర్వహణపై కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత కొద్దిసేపటికే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త సందీప్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అనిష్ గాయపడ్డారు.
ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కన్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తలకు గాయాలైన కాంగ్రెస్ కార్యకర్త సందీప్‌ని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనీష్ తలస్సేరిలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.