Jaggareddy: త్వరలో సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తా!
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 04:15 PM, Fri - 25 February 22
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి తీరును తప్పుబడతూ జగ్గారెడ్డి పార్టీ సీనియర్ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల కోరిక మేరకు, పార్టీ అధిష్టానం ఆదేశాల తన నిర్ణయం ఉంటుంది జగ్గారెడి స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశానికి జగ్గారెడ్డి హాజరై మాట్లాడారు. త్వరలో సోనియా, రాహుల్ ని కలుస్తానని, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిని వివరిస్తానని ఆయన వెల్లడించారు. ఒకవేళ వాళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే తన దారి తాను చూసుకుంటానని పరోక్షంగా హెచ్చరించారు. శివరాత్రి తర్వాత తన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, నా నిర్ణయాలను కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకించినా తప్పు పట్టనని ఆయన అన్నారు. ఒకవేళ పార్టీ మారిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే రాజకీయంగా పార్టీ నష్టపోతుందని, ముందే అధిష్టానానికి చెప్పానని జగ్గారెడ్డి గుర్తు చేశారు.