BRS Party: అమరవీరుల స్థూపాన్ని తాకే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు: ఎర్రోళ్ల
- Author : Balu J
Date : 26-04-2024 - 4:57 IST
Published By : Hashtagu Telugu Desk
BRS Party: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ..ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను 100 అమలు చేస్తాం అని చెప్పారని, ఆనాటి పిసిసి అధ్యక్షుడు గా నేటి ముఖ్యమంత్రి రేవంత్ డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు.
అనేక హామీలు 6 గ్యారెంటీ లు అమలు చేస్తాం అన్నారని, 26వ తేదీ నాడు నేను రాజీనామా లేఖతో వస్తున్న నీవు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ ను హరీశ్ రావు కోరినా కాంగ్రెస్ వెనుకడగు వేసిందని ఫైర్ అయ్యారు. అమరవీరుల స్థూపాన్ని తాకే నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని, కొంత మంది రేవంత్ అనుచరులు అమరవీరుల స్థూపం మలినం అయిందని వ్యాఖ్యలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ముందుగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తామని ఎర్రోళ్ల గుర్తు చేశారు.
అమరవీరుల స్థూపాన్ని మా బీఆర్ఎస్ పార్టీ దైవం తో సమానంగా చూస్తామని, 1969 మీ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే ఆనాడు 369 మంది అమరులు అయ్యారు అందుకే వారికి నివాళులుగా అమరవీరుల స్థూపాన్ని కట్టుకున్నామని ఆయన అన్నారు. ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా…ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నవా…పదవులకు రాజీనామా చేయమంటే పారిపోయింది మీరు కాదా అని ఎర్రోళ్ల ప్రశ్నించారు.