CM Revanth Japan Tour: జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల 15 నుంచి 22 వరకు అక్కడే!
ఎనిమిది రోజుల పాటు జపాన్‌లో సీఎం పర్యటన జరగనుంది. అంటే ఏప్రిల్ 15 నుంచి 22 వరకు ఈ పర్యటన ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. 8 రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో ఉంటారు.
- By Gopichand Published Date - 11:07 AM, Sat - 5 April 25

CM Revanth Japan Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు (CM Revanth Japan Tour) వెళ్లనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఎనిమిది రోజుల పాటు జపాన్‌లో సీఎం పర్యటన జరగనుంది. అంటే ఏప్రిల్ 15 నుంచి 22 వరకు ఈ పర్యటన ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. 8 రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో ఉంటారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం, జపాన్‌లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అభివృద్ధిని అధ్యయనం చేయడం కోసమని అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Rashmika Mandanna : ఆ దేశంలో రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
ఈ సందర్భంగా తెలంగాణలో స్థాపన జరుగుతున్న స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక పురోగతిని సీఎం అధ్యయనం చేయనున్నారు. అంతేకాకుండా ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో జపాన్ సహకారం అందించాలని కోరే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రం జపాన్‌తో సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేయనుంది.