CM Jagan in Tirumala: రేపు తిరుమలేశుని సేవలో సీఎం జగన్…
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
- Author : Balu J
Date : 26-09-2022 - 12:55 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదదేరి తిరుపతికి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను జగన్ ప్రారంభిస్తారు. రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించి, శ్రీవేంకటేశ్వరస్వామి స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభిస్తారు.