CM Jagan: ‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల
రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు నిధులను
- By Balu J Published Date - 03:10 PM, Tue - 8 February 22

రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కటం ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 85వేల 350 మంది లబ్దిదారులకు 285 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఈ పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా 10 వేల రూపాయల ఆర్ధిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తొంది. ఇవాళ అందించిన నిధులతో కలిపి.. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 583 కోట్ల రూపాయలు అందించిన్నట్లైంది.