Kodali Nani: సీఎం జగన్ 59 నెలల్లో 99శాతం హామీలు అమలు చేశారు: కొడాలి నాని
- By Balu J Published Date - 04:26 PM, Sat - 11 May 24

Kodali Nani: ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. గెలిచే టిడిపి అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.గతంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి, అందులో 99 శాతం హామీలు అమలు చేశామని.. గతంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా నన్ను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేశారు. ఒక్క రూపాయి కూడా లంచానికి తావు లేకుండా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారన్నారు. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలు ఉండేవని.. వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారని ఆయన విమర్శించారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదన్నారు. చేసిన మంచిని చూసి ప్రజలందరూ తమ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి… ఎమ్మెల్యేగా నన్ను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను భారీ మెజార్టీలతో గెలిపించాలని ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.