Davos : బిల్‌గేట్స్‌తో భేటి కానున్న సీఎం చంద్రబాబు
. రాష్ట్రంలో పెట్టుబడులపై బిల్ గేట్స్ తో సీఎం చర్చించనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనున్నది.
- By Latha Suma Published Date - 12:48 PM, Wed - 22 January 25

Davos : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు ఉన్నాయి. సీఎంతో భేటీ కానున్న వారిలో డీపీ వరల్డ్ గ్రూపు, యునీలీవర్, గూగుల్ క్లౌడ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు ఉన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సంస్థల అధినేతలతో భేటీ అయి చంద్రబాబు వివరించనున్నారు.
వీరితో పాటు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ ఈరోజు చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై బిల్ గేట్స్ తో సీఎం చర్చించనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనున్నది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్-పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు సీఎం హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వకమైన పాలసీలు, విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలపై పెట్టుబడిదారులకు చంద్రబాబు వివరిస్తారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్ రెన్యువబుల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు.