Chiru: ‘‘అమ్మా.. కరోనా కారణంగా నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా’’
నేడు మెగాస్టార్ చిరంజీవి మూతృమూర్తి అంజనా దేవి గారి జన్మదినం. రీసెంట్ గా చిరు కరోనా బారిన పడడంతో... ఇవాళ తన తల్లికి స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
- By Hashtag U Published Date - 11:06 AM, Sat - 29 January 22

నేడు మెగాస్టార్ చిరంజీవి మూతృమూర్తి అంజనా దేవి గారి జన్మదినం. రీసెంట్ గా చిరు కరోనా బారిన పడడంతో… ఇవాళ తన తల్లికి స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. దీంతో నేడు మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేశారు.
‘అమ్మా… జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు, మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ.. అభినందనలతో… శంకరబాబు’ అని ట్వీట్ చేశారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అనే విషయం మనకు తెలిసిందే. అందుకే తన తల్లికి విషెస్ చెప్పే క్రమంలో తన పేరును ఆయన శంకరబాబు గా సంబోధించుకున్నారు.
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022