HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chinas Constructing Worlds Largest Dam Lac

China: సూపర్ డ్యామ్ కోసం ప్రణాళికను కొనసాగిస్తున్న చైనా.. భారత్ అప్రమత్తం?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం అన్నది సాధ్యం కాదు అని ఇటీవలే ప్రముఖ భౌగోళిక రాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ తెలిప

  • Author : Anshu Date : 18-07-2023 - 5:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China
China

ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం అన్నది సాధ్యం కాదు అని ఇటీవలే ప్రముఖ భౌగోళిక రాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ తెలిపిన విషయం తెలిసిందే. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ డ్యామ్ భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం.

బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్‌లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది.

భారత వాస్తవ నియంత్రణ రేఖకు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు. కాగా 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం చైనా యార్లంగ్-త్సాంగ్‌పో బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్‌తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్‌తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్‌ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • constructing
  • india
  • world largest dam

Related News

Google India

భారత్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌… 20,000 మందికి ఉద్యోగాలు

Google  భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

  • Modi Master Mind

    అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • Trump Tariffs On India Redu

    భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

  • Record Vehicle Sales In Jan

    జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

Latest News

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

  • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

  • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

  • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

Trending News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd