HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chhattisgarh Congress Govt Survives No Confidence Motion Moved By Bjp

Congress Govt Survives : వీగిపోయిన బీజేపీ అవిశ్వాస తీర్మానం.. మెజారిటీ నిరూపించుకున్న సీఎం

Congress Govt Survives :  ఛత్తీస్‌గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా సీఎం భూపేష్ బాఘేల్  సారధ్యంలోని కాంగ్రెస్  ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

  • Author : Pasha Date : 22-07-2023 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Govt Survives
Congress Govt Survives

Congress Govt Survives :  ఛత్తీస్‌గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా సీఎం భూపేష్ బాఘేల్  సారధ్యంలోని కాంగ్రెస్  ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీజేపీ నేతృత్వంలోని  ప్రతిపక్షాలు శుక్రవారం అర్ధరాత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన  అవిశ్వాస తీర్మానం  మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురైంది. బీజేపీ తన అవిశ్వాస తీర్మానంలో సీఎం భూపేష్ బాఘేల్  ప్రభుత్వంపై 109 ఆరోపణలు చేసింది. ఈ తీర్మానంపై అసెంబ్లీలో 13 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు వాయిస్ ఓటింగ్ చేపట్టారు. మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ  72 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీని నిరూపించుకోవడంతో .. విపక్షాల అవిశ్వాస తీర్మానం(Congress Govt Survives) వీగిపోయింది. బీజేపీకి 13 మంది శాసనసభ్యులు ఉన్నారు.

Also read : Monsoon Pregnancy: గర్భిణులు బీ అలర్ట్.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

అనంతరం అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. అసెంబ్లీ కార్యకలాపాలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే అవిశ్వాస తీర్మానంలోని 109 ఆరోపణలపై అసెంబ్లీలో సీఎం భూపేష్ బాఘేల్ బదులివ్వడం ప్రారంభించగానే బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు.  వాస్తవానికి జులై 18 నుంచి జూలై 21 వరకు అసెంబ్లీ కార్యక్రమాలు జరిగాయి. సమావేశాల చివరి రోజైన శుక్రవారం విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. అవిశ్వాస తీర్మానంతో శుక్రవారం  అర్థరాత్రి అసెంబ్లీ సెషన్ ముగిసింది. కాగా,  సీఎం భూపేష్ బాఘేల్  సారధ్యంలోని కాంగ్రెస్  ప్రభుత్వంపై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.

Also read : Varun Tej & Lavanya: వరుణ్–లావణ్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్, మెగా పెళ్లి సందడి షురూ!

సీఎం భూపేష్ బాఘేల్  ఏమన్నారంటే..

“ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అధికార పార్టీకి కూడా తన సర్కారును నిలబెట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ మా సర్కారుపై చేసిన  109 ఆరోపణలు  కూడా అవాస్తవాలే. గతంలో అవిశ్వాస తీర్మానం వస్తే ముందుగా నక్సల్స్ సమస్యపైనే చర్చ జరిగేది. ఈసారి సభ్యులు దాని గురించి మాట్లాడలేదు. ఇది మా ఘనత”  అని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP No Confidence Motion
  • chhattisgarh
  • congress
  • Congress Govt
  • No Confidence Motion
  • Survives

Related News

Ktr Manuu

బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

HYD గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీకి చెందిన 50ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం నోటీసులివ్వడంపై ప్రతిపక్షాలు, విద్యార్థులు మండిపడుతున్నారు

  • Ktr Comments Revanth

    నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

  • Sonia Gandhi Hsp

    ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ, పార్టీ శ్రేణుల్లో ఖంగారు !!

  • Aasara Pension

    ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

  • Hilt Policy Telangana Assem

    హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ

Latest News

  • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd