Varun Tej & Lavanya: వరుణ్–లావణ్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్, మెగా పెళ్లి సందడి షురూ!
మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మొగనున్నాయి.
- By Balu J Published Date - 01:47 PM, Sat - 22 July 23

మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మొగనున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నిశితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ – లావణ్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల అంటే ఆగస్టు 24న వీరి వివాహానికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జంట విదేశాల్లో విహారిస్తున్నట్లు తెలుస్తోంది.
పెళ్లికి నెల మాత్రమే సమయం ఉండటంతో షాపింగ్ కోసం ఈ న్యూ కపుల్ పారిస్ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే నెలరోజుల్లో మెగా ఇంట పెళ్లి భాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన మిస్టర్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే తమ రిలేషన్ ను రహస్యంగా ఉంచారు. అయితే ఒకరి మనసులు మరొకరు తెలుసుకున్నాకే పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మరోవైపు వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. అంటే తన సినిమా విడుదల టైమ్‌కి వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాడన్నమాట. ఈ లెక్కన ‘గాంఢీవధారి అర్జున’ ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్ పాల్గొనే అవకాశం అయితే లేనట్లే అని చెప్పొచ్చు. అయితే వరుణ్, లావణ్యల పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read: Game Changer: రామ్ చరణ్ క్రేజ్.. గేమ్ ఛేంజర్ మూవీకి ‘జీ స్టూడియోస్’ 350 కోట్లు ఆఫర్!