Gold Silver Price: మహిళలకు ఇదే మంచి ఛాన్స్.. హైదరాబాద్, విజయవాడలో భారీగా తగ్గిన బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Silver Price) నేడు మరోసారి తగ్గాయి.
- By Gopichand Published Date - 07:23 AM, Fri - 6 October 23
Gold Silver Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Silver Price) నేడు మరోసారి తగ్గాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,160గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.73,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (అక్టోబర్ 06, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Assembly Polls Schedule: ఈనెల 12న అసెంబ్లీ పోల్స్ షెడ్యూల్ ?
We’re now on WhatsApp. Click to Join
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,310గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,760గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,160 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,100 ఉండగా, ముంబైలో రూ.71,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, కోల్కతాలో రూ.71,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కేరళలో రూ.73,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, విజయవాడలో రూ.73,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Silver Price: లక్ష రూపాయలకు చేరువలో కిలో వెండి ధర..?
వెండి తన ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం కిలో వెండి రూ.85,700కి చేరింది.