Gold Price: ఈరోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు మరోసారి తగ్గాయి.
- By Gopichand Published Date - 07:25 AM, Thu - 5 October 23
Gold Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు మరోసారి తగ్గాయి. గురువారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,370గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.73,100కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (అక్టోబర్ 05, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: NTR Silent: ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య రియాక్షన్.. ఐ డోంట్ కేర్
We’re now on WhatsApp. Click to Join.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,530గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,650గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,590 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,370 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,370గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,370గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,700 ఉండగా, ముంబైలో రూ.70,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, కోల్కతాలో రూ.70,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కేరళలో రూ.73,100గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, విజయవాడలో రూ.73,100 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Silver Price: లక్ష రూపాయలకు చేరువలో కిలో వెండి ధర..?
వెండి తన ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం కిలో వెండి రూ.85,700కి చేరింది.