NTR Silent: ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య రియాక్షన్.. ఐ డోంట్ కేర్
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వహించడంపై టీడీపీ ఎమ్మెల్యే, బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 04-10-2023 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
NTR Silent: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వహించడంపై టీడీపీ ఎమ్మెల్యే, బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను సినీ ప్రముఖులు ఖండించక పోయినా తాను బాధపడేది లేదని బాలకృష్ణ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ని ఉద్దేశించి చేశారని ఓ వర్గం ప్రచారం చేస్తుంది. నిజానికి ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుపై ఈ నాటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవర్గం ఎన్టీఆర్ కి మద్దతు ఇస్తున్నారు. ఎన్టీఆర్ కేవలం నటుడు, రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించడం లేదు కదా, పైగా కేసు వివరాలు తెలియకుండా ఏమని స్పందిస్తాడు అంటూ అంటున్నారు. ఏదేమైనా నందమూరి, నారా వారి కుటుంబంలో ఎన్టీఆర్ మౌనం అలజడి సృష్టిస్తుంది.
గత నెలలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కిల్ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఇదే మీడియాలో సమావేశంలో మంత్రి రోజాపై చెలరేగిన వివాదంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు బాలకృష్ణ. బురదలో రాయి వేస్తే మనపైనే పడుతుంది. రోజా గురించి మాట్లాడకపోవడమే మంచిందని అభిప్రాయపడ్డారు బాలకృష్ణ. రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన ‘అవమానకర’ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రోజాపై, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
Also Read: Drugs : తెలంగాణలో డ్రగ్స్ పెడ్లర్ సహా ఐదుగురు అరెస్ట్.. 18గ్రామలు MDMA స్వాధీనం