YS Viveka Murder : జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత ట్వీట్.. వివేక మరణించి నేటికి నాలుగేళ్లు
వివేక హత్యకు నాలుగేళ్లు అయిన సందర్భంగా జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య
- Author : Prasad
Date : 15-03-2023 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
వివేక హత్యకు నాలుగేళ్లు అయిన సందర్భంగా జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని పులివెందుల పూల అంగాళ్ల నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు అంటూ ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారని.. చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంలోనూ విఫలమైయ్యారన్నారు. వివేకా హత్య ఆ ఇంట జరిగిన కుట్రేనని చంద్రబాబు ట్వీట్ చేశారు. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి… బాబాయ్ హత్య తో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి….ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రం లో ప్రతి ఇంటా తెలుసు…అది ఆ ఇంట జరిగిన కుట్రే.(2/3)#JusticeForYSViveka
— N Chandrababu Naidu (@ncbn) March 15, 2023