HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrababu In Acb Court Chances That The Trial Will Continue Till Noon

Chandrababu In ACB Court: ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగే ఛాన్స్..?

చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో (Chandrababu In ACB Court) హాజరుపరిచారు.

  • Author : Gopi Date : 10-09-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu In ACB Court
New Web Story Copy 2023 09 09t163705.895

Chandrababu In ACB Court: చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో (Chandrababu In ACB Court) హాజరుపరిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నంద్యాలలో శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకూ కొనసాగుతాయని అంటున్నారు. కాగా తొలుత 409 సెక్షన్ పై చంద్రబాబు లాయర్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు స్టేట్మెంట్ ను సైతం రికార్డు చేశారు. ప్రస్తుతం సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో సీఐడీ ఆదివారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అయితే కోర్టు వద్దకు అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. అంతేకాకుండా చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధిస్తే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. కోర్టు పరిసరాల నుంచి మీడియా ప్రతినిధులను దూరంగా పంపించేశారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. 2021, డిసెంబర్ 9వ తేదీ కంటే ముందే నేరం జ‌రిగింద‌ని, ఈ కేసులో చంద్ర‌బాబే ముఖ్య కుట్ర‌దార‌ని రిపోర్టులో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ. 371 కోట్లను చెల్లించార‌ని తెలిపారు.

Also Read: ACB Court: బాబు A-1 కాదు.. A-37, స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకం: సీఐడీ తరుపు న్యాయవాది

టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ కోర్టులో సీఐడీ రిమాండ్ రిపోర్టు ప్రవేశపెట్టగా అందులో నారా లోకేష్ పేరును సీఐడీ చేర్చింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో నారా లోకేష్ పేరు కూడా చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చారని తొలుత ప్రచారం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఏ-1గా గంటా సుబ్బారావు ఉండగా, చంద్రబాబు పేరును ఏ-37గా సీఐడీ అధికారులు చేర్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Court
  • ap politics
  • chandrababu
  • Chandrababu Arrest
  • Chandrababu In ACB Court

Related News

TDP Mahanadu 2026 Event In Nellore

Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహానాడుకు వేదిక, తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎక

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd