Women Reservation Bill: లోక్‌సభలో పెరగనున్న మహిళా ఎంపీల సంఖ్య @181
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొత్తానికి ఆమోదముద్ర పడింది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఈ బిల్లును ఈ రోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు
- Author : Praveen Aluthuru
Date : 19-09-2023 - 3:11 IST
Published By : Hashtagu Telugu Desk
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొత్తానికి ఆమోదముద్ర పడింది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఈ బిల్లును ఈ రోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మొదట ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. బిల్లు చట్టంగా మారడంతో లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 181కి చేరుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. దిగువ సభలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారు.
కొత్త పార్లమెంట్ హౌస్ లో తొలిరోజు కార్యక్రమాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థిస్తూ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించినదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA సవరణ ద్వారా మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేయబడతాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ కాలపరిమితి 15 ఏళ్లని అన్నారు.
అంతకుముందు సభలో కాంగ్రెస్, అధికార పార్టీ బీజేపీ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ ప్రశ్న లేవనెత్తారు. ఇప్పుడు ఆమోదించిన బిల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో కూడా దీనిని ప్రవేశపెట్టారని గుర్తు చేశాడు. అయితే ఆ బిల్లు ఇప్పుడు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.ఈ అంశంపై లోక్‌సభలో పెద్ద దుమారమే చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ ప్రసంగంపై ఎన్డీయే ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read: Pawan Kalyan: జనసేనకు గ్లాస్ గుర్తు, ఎన్నికల సంఘానికి పవన్ కృతజ్ఞతలు!