Pawan Kalyan: జనసేనకు గ్లాస్ గుర్తు, ఎన్నికల సంఘానికి పవన్ కృతజ్ఞతలు!
ఈసీ జనసేన కు అధికారంగా గ్లాస్ గుర్తును కేటాయించడంతో పవన్ ఈసీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
- By Balu J Published Date - 02:59 PM, Tue - 19 September 23

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్లాస్ సింబల్ ను కేటాయించాలని ఎన్నికల సంఘానికి వినతి పెట్టుకున్నారు. దీంతో జనసేన కు అధికారంగా గ్లాస్ గుర్తును కేటాయించడంతో పవన్ ఈసీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడంతో పవన్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ‘‘రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు.
Also Read: Allu Arjun Statue: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం, మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ విగ్రహం