Tomato Price: టమోటా ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్న తరుణంలో కేంద్రం రంగంలోకి దిగి సామాన్యులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 16-07-2023 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
Tomato Price: దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్న తరుణంలో కేంద్రం రంగంలోకి దిగి సామాన్యులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రధాన నగరాల్లో టమాటా ధరలు విపరీతంగా పెరిగి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. కిలోకు 150-160 కి చేరుకున్నాయి. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ఊరట కల్పించనుంది.
కేంద్రం ఆదివారం టమాట ధరను కిలో రూ.90 నుంచి రూ.80కి తగ్గించింది. మార్కెట్ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన తరువాత టమోటా ధరను సవరించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) మరియు నేషనల్ కన్స్యూమర్ కోఆపరేషన్ ఫెడరేషన్ (NCCF) ద్వారా ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా, ముజఫర్‌పూర్ లలో ధరలో మార్పులు జూలై 16 ఆదివారం నుండి అమలు చేయబడతాయి. అయితే రానున్న రోజుల్లో అన్ని నగరాల్లో ధరలు తగ్గనున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాట వచ్చిందని ఎన్‌సీసీఎఫ్ చైర్మన్ విశాల్ సింగ్ తెలిపారు.
Read More: TTD : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..?