Tirupati Stampede : ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి – అమిత్ షా
Tirupati Stampede : ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు
- Author : Sudheer
Date : 19-01-2025 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Sha) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు చర్చించి, కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, విశ్వహిందూ పరిషత్ నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.
Xiaohongshu Vs TikTok : టిక్‌టాక్ సైలెంట్.. అమెరికాను ఊపేస్తున్న మరో చైనా యాప్
ఇక తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి బైరాగిపట్టెడలో గల పద్మావతి పార్కు, రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న విష్ణునివాసం వద్ద ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.