Xiaohongshu Vs TikTok : టిక్‌టాక్ సైలెంట్.. అమెరికాను ఊపేస్తున్న మరో చైనా యాప్
ఈ యాప్(Xiaohongshu Vs TikTok) డౌన్‌లోడ్స్ పెరిగిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని వ్యూస్ వచ్చి ఉంటాయో మనం అంచనా వేసుకోవచ్చు.
- By Pasha Published Date - 01:02 PM, Sun - 19 January 25

Xiaohongshu Vs TikTok : అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ వైపు చైనా సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’పై బ్యాన్ అమల్లోకి రాగా.. మరోవైపు చైనాకే చెందిన ఇంకో యాప్ వేగంగా జనంలోకి చొచ్చుకుపోతోంది. షియావోహోంగ్షు (రెడ్ నోట్) అనే పేరు కలిగిన యాప్ ఒకటి ఆకస్మికంగా జనాదరణ పొందుతోంది. అమెరికాలో దాని డౌన్‌లోడ్లు వేగంగా జరుగుతున్నాయి. టిక్ టాక్ పనిచేయకపోవడంతో ఇప్పటివరకు దాన్ని వినియోగించిన వారంతా షియావోహోంగ్షు (రెడ్ నోట్) యాప్‌లోకి మైగ్రేట్ అవుతున్నారు. “TikTok refugees” అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ యాప్‌ను లక్షలాది మంది నెటిజన్లు ప్రమోట్ చేస్తుండటం గమనార్హం. గత గురువారం రోజు షియావోహోంగ్షు (రెడ్ నోట్) యాప్‌లోని యూజర్లు అందరికీ #TikTokrefugee “Welcome the global villagers” అనే సందేశం అందింది. ఇదే ఇప్పటికీ ట్రెండింగ్ టాపిక్‌గా కొనసాగుతోంది. దీనికి గురువారం ఒక్కరోజే దాదాపు 89 లక్షల వ్యూస్ వచ్చాయట. ఈ యాప్(Xiaohongshu Vs TikTok) డౌన్‌లోడ్స్ పెరిగిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని వ్యూస్ వచ్చి ఉంటాయో మనం అంచనా వేసుకోవచ్చు. అకస్మాత్తుగా జనాదరణను అందుకుంటున్న సరికొత్త చైనా యాప్ గురించి తెలుసుకుందాం..
Also Read :Naga Sadhus : తమకు తామే పిండం పెట్టుకొని నాగ సాధువులైన 1,500 మంది
షియావోహోంగ్షు (రెడ్ నోట్) యాప్ గురించి..
- షియావోహోంగ్షు (రెడ్ నోట్) అనేది లైఫ్ స్టైల్ సోషల్ మీడియా యాప్.
- ఇందులోనూ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ ఉంది. షాపింగ్ చేయొచ్చు.
- షార్ట్ వీడియోలను అప్ లోడ్ చేయొచ్చు. ఫొటోలను, టెక్ట్స్ మెసేజ్‌లను అప్‌లోడ్ చేయొచ్చు.
Also Read :30 Lakh Dogs Killing : 30 లక్షల కుక్కలు బలి.. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం దారుణ స్కెచ్
- వాస్తవానికి షియావోహోంగ్షు (రెడ్ నోట్) యాప్ పాతదే. దానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది యూజర్లు ఉన్నారు.
- ఈ యాప్‌ను ప్రతినెలా వినియోగిస్తున్న వారిలో దాదాపు 30 కోట్ల మంది చైనా యూజర్లే. అందుకే ఈ యాప్‌లోని చాలా భాగాలు ఇప్పటికీ చైనా భాషలోనే అందుబాటులో ఉన్నాయి.
- మారియా కారే, ఎలాన్ మస్క్ తల్లి మేయే మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.
- 2018 సంవత్సరం నుంచి ఈ యాప్‌ను కిమ్ కర్దాషియన్ సైతం వాడుతున్నారు.