Politics: ఏపీ, తెలంగాణ సీఎస్ లతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం
- Author : hashtagu
Date : 27-12-2021 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన కొనసాగుతున్న జల వివాదం గురించి తెలిసిందే. జల వివాదం ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు మొగ్గుచూపడం లేదు. కాగా తాజాగా రేపు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై ఏపీ, తెలంగాణ సీఎస్ లతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం నిర్వహించనుంది.కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై వర్చువల్ గా ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది అని జలవనరుల శాఖా వెల్లడించింది.