Naresh Goyal: జెట్ ఎయిర్‌వేస్ యజమాని నరేష్ గోయల్ ఆస్తులపై సీబీఐ ఎటాక్
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఆస్తులపై సీబీఐ ఆరా చేసింది. ఈ మేరకు ముంబైలోని జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన స్థలాలు, గోయల్‌కు చెందిన స్థలాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ తెలిపింది
- By Praveen Aluthuru Published Date - 07:15 PM, Fri - 5 May 23

Naresh Goyal: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఆస్తులపై సీబీఐ ఆరా చేసింది. ఈ మేరకు ముంబైలోని జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన స్థలాలు, గోయల్‌కు చెందిన స్థలాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. బ్యాంకు మోసాలపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నరేష్ గోయల్, ఆయన భార్య అనిత, మాజీ ఎయిర్‌లైన్ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద్ శెట్టి నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. కెనరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు 538 కోట్ల రూపాయల బ్యాంకు మోసంపై ఏజెన్సీ తాజా కేసు నమోదు చేసింది.
గతంలో మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ యజమానిపై నమోదైన కేసును బాంబే హైకోర్టు రద్దు చేసింది. వాస్తవానికి గోయల్ మోసం చేశాడని ఆరోపించిన కేసులో ED 2020లో ట్రావెల్ కంపెనీపై PMLA కింద కేసు నమోదు చేసింది.
Read More: PM Narendra: ది కేరళ స్టోరీ సినిమాకు మద్దతు తెలిపిన మోడీ.. కర్ణాటక పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ?