Hyderabad: దూసుకెళ్లిన కారు.. ఒకరు దుర్మరణం
హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ లో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది.
- By Hashtag U Published Date - 03:10 PM, Mon - 25 April 22

హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ లో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని కుంట్లూరుకు చెందిన రఘురాం గా గుర్తించారు. హయత్ నగర్ వైపు వెళ్తున్న కారు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అతివేగం కారణంగా అదుపు తప్పిన కారు రఘురాం పై నుంచి దూసుకెళ్లింది. సంఘటన స్థలానికి పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీకొట్టిన తర్వాత గానీ ఆ కారు ఆగలేదు.