Vadodara Accident: వడోదరలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని జాతీయ రహదారిపై రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
- Author : Praveen Aluthuru
Date : 04-03-2024 - 9:47 IST
Published By : Hashtagu Telugu Desk
Vadodara Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని జాతీయ రహదారిపై రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సూరత్ నుండి వడోదరకు తిరిగి వస్తున్న కుటుంబం కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది, దాని కారణంగా ఈ విషాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న చిన్నారి సహా 5 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అయితే, 4 ఏళ్ల బాలిక అస్మితా పటేల్ ప్రాణాలతో బయటపడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న మకరపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పాటు ఆంబులెన్స్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు.
ఈ ప్రమాదంలో ప్రజ్నేష్‌భాయ్ పటేల్ (34), మయూర్‌భాయ్ పటేల్ (30), ఊర్వశిబెన్ పటేల్ (31), భుంబేన్ పటేల్ (28 ), లవ్ పటేల్ (1) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Indian Navy: పరీక్ష లేకుండానే జాబ్.. లక్షల్లో జీతం..!