HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Car Door Took The Life Of A Child In Hyderabad

Baby Girl Death: హైదరాబాద్ లో ఘోరం.. చిన్నారి ప్రాణం తీసిన కార్ డోర్!

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోరం జరిగింది. రోడ్డుపక్కన ఆగివున్న కారు డోర్ సడెన్‌గా తీయడంతో చిన్నారి పోయింది.

  • Author : Balu J Date : 02-06-2023 - 4:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని నిర్లక్ష్యంతో జరిగితే, మరికొన్ని అతివేగం కారణంగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ అపార్ట్ మెంట్ లో ఎండ వేడిమి తట్టుకోలేక సెల్లార్ లో మూడేళ్ల పాప నిద్రపోతోంది. అయితే విషయం గమనించగా కారు ఓనర్ పాపపై నుంచి కారును పోనివ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

తాజాగా జరిగిన  ఓ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోరం జరిగింది. రోడ్డుపక్కన ఆగివున్న కారు డోర్ సడెన్‌గా తీయడంతో చిన్నారితో కలిసి బైక్‌‌పై వెళ్తున్న దంపతులు కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో రెండేళ్ల పాప ధనలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సీసీ పుటేజ్ వైరల్ అవుతోంది.

ఈ ప్రమాదంలో చిన్నారి తల్లి శశిరేఖకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న ఆ భర్త కూడా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శశిరేఖను దగ్గర్లోని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Also Read: Mamata Banerjee: మమతా మానవత్వం, గాయపడ్డ జర్నలిస్టును కారులో ఆస్పత్రికి తరలించిన సీఎం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baby girl
  • hyderabad
  • police case
  • road accident

Related News

Musi River

Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు

  • Goat Sheep

    గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • NTR Dragon shooting Hyderabad

    హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd