Mamata Banerjee: మమతా మానవత్వం, గాయపడ్డ జర్నలిస్టును కారులో ఆస్పత్రికి తరలించిన సీఎం!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేనర్జీ మానవత్వం చాటుకొని ప్రజల మనుసులను దొచారు.
- Author : Balu J
Date : 02-06-2023 - 4:09 IST
Published By : Hashtagu Telugu Desk
రాజకీయ నాయకులు, ప్రజలు ఒక్కటే. కానీ ఈ తరం నాయకులు మాత్రం రాజకీయ నాయకులు, ప్రజలు వేర్వేరు అని విభజిస్తూ ప్రజలకు దూరంగా ఉండిపోతున్నారు. ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడో, సొంత గ్రాఫ్ ను పెంచుకోవడం కోసమో ప్రజల దగ్గరకు వెళ్తున్న రోజులివి. కానీ కొందరు నాయకులు మాత్రం ‘మేం ఉన్నది ప్రజల కోసమే’ అని చాటి చెప్తుంటారు.
గతంలో ఇందిరాగాంధీ లాంటి నేతలు గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేయడం చూశాం. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అనేక రోడ్ షోలు చేయడం కూడా మనం చూశాం. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి సమయంలో లారీ ప్రయాణం చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కార్యక్రమంలో కవరేజ్ కు వచ్చి వీడియో జర్నలిస్ట్ గాయపడ్డారు. అయితే ఆసుపత్రికి తరలించడానికి తన అధికారిక కారును ఇచ్చారు. ఆ తర్వాత మరో జర్నలిస్ట్ బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్లారు. ఒక అట్టడుగు నాయకురాలు కావడం వల్లే మమతా బెనర్జీ సకాలంలో స్పందించిందని అంటున్నారు. ప్రజలు మమతా మానవత్వాన్ని ప్రశంసిస్తున్నారు.
Also Read: Russian Devotee: శ్రీవారికి ప్రేమతో.. టీటీడీకి రష్యన్ భక్తుడు 7.6 లక్షల విరాళం!