Canada : కెనడాని భయపెడుతున్న మంకీపాక్స్ .. 957 కేసులు నమోదు
కెనడాలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 957 మంకీపాక్స్ కేసులనుకెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ
- Author : Prasad
Date : 06-08-2022 - 10:20 IST
Published By : Hashtagu Telugu Desk
కెనడాలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 957 మంకీపాక్స్ కేసులనుకెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నిర్ధారించింది. శుక్రవారం నాటికి ధృవీకరించబడిన కేసులలో అంటారియో నుండి 449, క్యూబెక్ నుండి 407, బ్రిటిష్ కొలంబియా నుండి 81, అల్బెర్టా నుండి 16, మరియు సస్కట్చేవాన్, యుకాన్ నుండి రెండు కేసులు నమోదయ్యాయని ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ స్టేట్స్ మంకీపాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో కెనడా కూడా దీనిని అనుసరించాలా వద్దా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేలో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఫెడరల్ ప్రభుత్వం మంకీపాక్స్‌ను ప్రాధాన్యతగా పరిగణించిందని PHAC అధికారి తెలిపారు.