HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Can Potatoes Help You Lose Weight

Weight Loss: బరువు తగ్గించే బంగాళదుంపలు…!

టైటిల్ చదవగానే ఏదో తేడాగా అనిపిస్తుంది కదూ..!ఎందుకంటే పొటాటో బరువు తగ్గిస్తుందా...?

  • By Hashtag U Published Date - 01:04 PM, Sat - 19 February 22
  • daily-hunt
Potato
Potato

టైటిల్ చదవగానే ఏదో తేడాగా అనిపిస్తుంది కదూ..!ఎందుకంటే పొటాటో బరువు తగ్గిస్తుందా…? అదే కదా మీ డౌట్..అక్కడికే వస్తున్నాం..! అధిక క్యాలరీలు ఉన్న బంగాళదుంప తినడం వల్ల బరువు పెరుగుతామని చాలామంది అనుకుంటారు. కానీ సహజంగా వంటల్లో బంగాళదుంపలు ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరుగుతామని చాలా ఏళ్ల నుంచి నమ్ముతునే ఉన్నారు.అంతేకాదు పొటాటోస్ ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు, మధుమేహంతో బాధపడేవారు.. పైసా ఖర్చు లేకుండా పొటాటోతో నివారించుకోవచ్చు. బంగాళదుంపలలో కార్బొహైడ్రేట్స్ కంటెంట్ తోపాటు గ్లైసెమిక్ సూచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొటాటోలను సరైన పద్ధతిలో తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చు.

సాధారణంగా ఇతర పోషకాల వలే…ఈ బంగాళదుంపలోని పోషకాలు కూడా కొంచెం గందరగోళాన్ని కలిగిస్తాయి. అయితే బంగాళదుంప తింటే బరువు తగ్గుతారు అనగానే…పొటాటో ఫ్రైలు, చిప్స్ లాంటివి తింటే బరువు తగ్గరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే వీటిని ఆయిల్లో వేయించడం వల్ల శరీరానికి అదనంగా క్యాలరీలు చేరుతాయి. ఆరోగ్యానికి కీడు చేస్తాయి.
అందుకే బరువును తగ్గించుకోవాలంటే…పొటాటోలను ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొలస్ట్రాల్ చేరడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్, అధికరక్తపోటు, కీళ్లనొప్పులు వంటి వ్యాధులకు కారణం అవుతుందని మనలో చాలామందికి తెలుసు. అయితే బంగాళదుంపలు బరువు తగ్గించడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.

బంగాళదుంపలు జీవక్రియను పెంచుతాయి…
వీటిలో…ప్రోటీజ్ ఇన్హిబిటర్స్ -2 పుష్కలంగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి కొలిసిస్టోకినిన్ అనే హార్మోన్ విడుదల చేయడం ద్వారా జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు బంగాళదుంపలో పాలీఫెనాల్స్ అనే పిలిచే యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి.

బంగాళదుంపలు బరువు తగ్గడానికి ఎలా సహాయపడతాయి…
బంగాళదుంపలలో ఉండే అధిక పోటాషియం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కొవ్వు కణాలను కూడా తగ్గిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయానాల్లో తేలింది. మొత్తానికి మీరు తీసుకునే ఆహారంలో పరిమితంగా క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి.

సరైన క్రమంలో తినాలి….
డీప్ ఫ్రై,చిప్స్, ఫ్రైస్ ఇలాంటి తీసుకోకూడదు. ఇందులో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా బరువు పెరిగిపోతారు. వేయించిన పొటాటోలు, కాల్చినవి, ఉడకబెట్టినవి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అయితే పొటాటో స్నాక్స్ తీనవచ్చు. ఆలివ్ నూనెలో వేయించినవి తీసుకోవడం మంచిది.

మొత్తానికి బంగాళదుంపలు సరైన పద్ధితిలో తీసుకున్నట్లయితే బరువు తగ్గడంలో సహాయపడతాయని చెప్పవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • potato diet
  • potatoes help weight loss
  • potatoes increase metabolism
  • weight loss

Related News

Diet Drink

‎Diet Drink: 15 రోజుల పాటు ఈ జ్యూస్ ని తాగితే చాలు.. ఎంత లావుగా ఉన్నా సరే సన్నజాజి తీగలా మారాల్సిందే!

Diet Drink: ‎15 రోజుల పాటు ప్రతీ రోజు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ని తాగితే ఎంత లావుగా ఉన్నా సరే సన్న జాజి తీగ లాగా సన్నగా మారాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Latest News

    • Piracy : ఇక పైరసీ భూతం వదిలినట్లేనా..? ఇండస్ట్రీ కి మంచి రోజులు రాబోతున్నాయా..?

    • Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!

    • Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    • Anti Maoist Operation : భారీ ఎన్‌కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?

    • Telangana Roads: తెలంగాణ లో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    Trending News

      • Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు న‌యా ఫార్ములా?!

      • RCB: ఆర్సీబీపై ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌస్ క‌న్ను!

      • iBomma: ఐబొమ్మ వ‌ల‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఎంత లాస్ వ‌చ్చిందంటే?

      • Smriti Mandhana: ఈనెల 23న‌ టీమిండియా ఓపెన‌ర్ పెళ్లి.. హాజ‌రుకానున్న రోహిత్‌, కోహ్లీ!

      • Golden Passport: గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలు ఏంటి?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd