HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bumrahs Career Best Restricts England To 110

Bumrah: బూమ్రా,షమీ పేస్‌ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపారు. బూమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో

  • Author : Naresh Kumar Date : 12-07-2022 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bumrah
Bumrah

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపారు. బూమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన వేళ ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. పరిమిత ఓవర్ల ఫార్మేట్‌లో తన ఫామ్ కొనసాగిస్తున్న బూమ్రా తొలి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బ్యాటర్లను హడలెత్తించాడు. బూమ్రా ధాటికి జాసన్ రాయ్, బెయిర్‌ స్టో, రూట్‌ ఇలా వచ్చి అలా వెళ్ళారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ రెండో ఓవర్‌ నుంచే వికెట్లు పారేసుకుంది. బుమ్రా చెలరేగి బౌలింగ్‌ చేయడంతో ఆ టీమ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో 6 పరుగుల దగ్గర ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ వికెట్‌ కోల్పోయిన ఇంగ్లీష్ టీమ్ ఏ దశలోనూ కోలుకోలేదు.

అటు షమీ కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఒక దశలో 68 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు 100 దాటడం కష్టమనిపించింది. డేవిడ్ విల్లీ 21 రన్స్ చేయడంతో స్కోర్ 100 దాటగలిగింది. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన బూమ్రా 19 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. షమీ 3 వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా దెబ్బకు ఆ టీమ్‌లో నలుగురు స్టార్‌ బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. ఇండియాపై వన్డేల్లో ఇంగ్లాండ్‌కు ఇదే అతి తక్కువ స్కోరు.

కాగా కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసిన బూమ్రా అరుదైన రికార్డ్ సాధించాడు. భారత్ తరపున వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గతంలో స్టువర్ట్ బిన్నీ 2014లో కేవలం 4 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉండగా.. అనిల్ కుంబ్లే 1993లో విండీస్‌పై 12 రన్స్‌కు 6 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై బూమ్రా 19 పరుగులకు 6 వికెట్లతో వారి తర్వాతి స్థానంలో నిలిచాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anil kumble
  • bumrah
  • england
  • India vs England
  • ODIs
  • shami

Related News

MS Dhoni's Reaction To Wife Sakshi

బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

MS Dhoni’s Reaction To Wife Sakshi  టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో మైదానంలో ఆటగాళ్లు ఎంత టెన్షన్ పడ్డారో, గ్యాలరీలోనూ అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి అత్యుత్సాహాన్ని తనదైన ‘కూల్’ స్టైల్‌లో కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్ల

  • Harry Brook dropped an easy catch

    నా వ‌ల్లే ఓడిపోయాం..కెప్టెన్ హ్యారీ బ్రూక్

  • India vs England

    ఇంగ్లాండ్‌తో సెమీ ఫైన‌ల్ పోరు.. చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌!

  • India vs England

    భార‌త్‌- ఇంగ్లాండ్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు?

  • India Vs England T20

    India vs England : వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd