KTR : ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్..
KTR : ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
- By Kavya Krishna Published Date - 12:17 PM, Wed - 18 December 24

KTR : ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్తూ, వారికి సంఘీభావం ప్రకటించారు. ఆటో డ్రైవర్ల హక్కుల పరిరక్షణకు ప్రతిజ్ఞగా, ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయల్దేరిన ఎమ్మెల్యేలు, తమ నిరసనతో ప్రత్యేకమైన సందేశాన్ని పంపించారు. “ఆటో కార్మికులను ఆదుకోవాలి!” అంటూ నినాదాలు చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రాష్ట్రంలో తీవ్రమైన సమస్యగా మారాయని, ఇప్పటి వరకు 93 మంది డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కేటీఆర్ ఆటోలో నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు.
“గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఆత్మహత్యల జాబితాను ప్రభుత్వానికి అందజేశాం. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దౌర్భాగ్యం. ప్రతి ఆటోడ్రైవర్‌కు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సాయం ఇవ్వాలన్న హామీని వెంటనే అమలు చేయాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు. అదనంగా, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని ఆయన కోరారు.
Six People Died: కథువాలో విషాదం.. ఆరుగురు దుర్మరణం
ఆటో డ్రైవర్ల సంక్షేమంపై బీఆర్‌ఎస్ ప్రతిపాదనలు
బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ద్వారా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రధానంగా చర్చించాలనుకుంది. ఈ తీర్మానంలో, “రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితి వారిని ఆత్మహత్యల వరకు నెట్టివేస్తోంది” అని పేర్కొంది.
బీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేకంగా కొన్ని కీలక డిమాండ్లను ప్రస్తావించింది:
ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలి.
ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా ₹12,000 ఆర్థిక సాయం అందించడాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలి.
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి.
“ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఒక చీకటి అధ్యాయం. వారికోసం పోరాడడమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ బాధ్యత” అని పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Chalo Raj Bhavan: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్!