Krishank Remanded: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..!
బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు షాక్ తగిలింది.
- By Gopichand Published Date - 10:49 AM, Thu - 2 May 24

Krishank Remanded: బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు షాక్ తగిలింది. బుధవారం క్రిశాంక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా కోర్టు కీలక తీర్పునిచ్చింది. క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్ (Krishank Remanded) విధిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) మెస్‌లు మూసివేత, యూనివర్శిటీ సెలవులపై క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ దుష్ప్రచారం చేశారని ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వారిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ టీజర్ వచ్చేసింది.. పవర్ ప్యాక్డ్‌గా పవన్ కల్యాణ్..!
క్రిశాంక్, నాగేందర్ ఓయూ ప్రతిష్ఠకు భంగం కలిగేంచేలా చర్యలు చేపట్టారని ఓయూ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయటంతో వారిద్దరిపై పలు రకాల సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. Ipc 466,468 ,469 ,505 (1)(C) కింద వారిపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం పంతంగి టోల్‌గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో క్రిశాంక్‌ను గత రాత్రి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో క్రిశాంక్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గతంలో కూడా క్రిశాంక్‌పై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి మన్నె క్రిశాంక్ గాంధీ హాస్పిటల్‌కు వచ్చిన సమయంలో అతని కోసం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మా రావు గౌడ్ కూడా వచ్చారు.
We’re now on WhatsApp : Click to Join