HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brother Anil Kumar Shocking Comments On Cm Jagan

Brother Anil: ‘జగన్’ పై ‘బ్రదర్ అనిల్’ సంచలన వ్యాఖ్యలు

సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు.

  • Author : hashtagu Date : 14-03-2022 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brother Anil
Brother

సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన BC, SC, ST సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘాల వాళ్లంతా తనకోసమే పనిచేశారు తప్ప జగన్ కోసం పని చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బ్రదర్ అనిల్. తాను సీఎం జగన్ ను నేరుగా కలవాల్సిన అవసరం లేదని తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి జగన్ ను అస్సలు కలవనేలేదని వెల్లడించారు. ఆంధ్రాలో వైసీపీ విజయానికి కృషి చేసిన వాళ్లకు న్యాయం జరగడం లేదు.. పార్టీ కష్టకాలంలో… పార్టీతో నడిచిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

పైరవీ కారులు, పైరవీలతో వచ్చిన వాళ్ళు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… పార్టీ కోసం పని చేసిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను రాజకీయ పార్టీ పెట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోందని చెప్పిన బ్రదర్ అనిల్… పార్టీ పెట్టడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదని పేర్కొన్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.. వైఎస్ కుటుంబంలో జగన్ కు షర్మిలకు మధ్య ఎలాంటి విభేదాలు నడుస్తున్నాయో అనేది. మొత్తంగా చూస్తే రాజకీయవర్గాలలో బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోవైపు వైసీపీకి 151 స్థానాలు రావడానికి బ్రదర్ అనిల్ పిలుపే కారణమని తెలిపారు ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అనూక్. 2019 ఎన్నికల్లో జగన్ గెలవాలని ఎంతో కష్టపడ్డాం – మాకు 100 శాతం అన్యాయం జరిగింది – ప్రభుత్వంలో మా మొర వినేవారు లేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అనూక్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan Mohan Reddy
  • ap politics
  • brother anil kumar
  • comments

Related News

nara lokesh with pawan kalyan

నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్, ఇప్పుడు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు చేపట్ట

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd