AP : పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ పవన్ ఫై బొత్స ఫైర్
ముగ్గురు మూడు దిక్కులా తిరుగుతూ తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని
- By Sudheer Published Date - 08:03 PM, Sat - 19 August 23

వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) , ఆయన కుమారుడు లోకేష్ (Nara Lokesh) , అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విరుచుకపడ్డారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , లోకేష్ లు మరో ఆరు నెలలు మాత్రమే ఏపీలో ఉంటారని , ఆ తర్వాత హైదరాబాద్ కే పరిమితం అవుతారని బొత్స అన్నారు. వచ్చే ఏడాది ఉగాది తరువాత ఈ ముగ్గురు కనిపించబోరని, ఈ ఆరు నెలలు వారి అరుపులు, కేకలు ఉంటాయని, వాటిని భరించక తప్పదని చెప్పుకొచ్చారు.
శనివారం వైజాగ్ లో మీడియా సమావేశం ఏర్పటు చేసిన బొత్స..తనదైన శైలి లో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై విమర్శలు కురిపించారు. టీడీపీ హయాంలో దోపిడీ, పెత్తందారీ వ్యవస్థ పవన్ కళ్యాణ్ కు కనిపించలేదా? రుషికొండలో జరుగుతోంది ప్రభుత్వ భవనాల నిర్మాణం… పైగా ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లోనే జరుగుతున్నాయి… నీకెందుకు నొప్పి? అందుకే ప్రజలు నిన్ను ఆమోదించడంలేదు” అని బొత్స పవన్ ఫై విరుచుకపడ్డారు. రాజకీయ పరిజ్ఙానం లేని పవన్ కు మేము సమాధానం చెప్పాలా..? పవన్ కళ్యాణ్.. చంద్రబాబు పాలన బాగుందని చెప్తున్నారు. ఏం బాగుందో చెప్పండి..? అని బొత్స ప్రశ్నించారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు పవన్ కళ్యాణ్ కు కూడా అలాగే కనిపిస్తున్నారు.
పవన్ , చంద్రబాబు , లోకేష్ లు ముగ్గురు మూడు దిక్కులా తిరుగుతూ తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని.. అసలు వారు ఎందుకు సహనం కోల్పోతున్నారని ప్రశ్నించారు. వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తారంటూ మంత్రి బొత్స చురకలు అంటించారు. సీఎం జగన్ (CM Jagan) సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన అందస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తోందని బొత్స అన్నారు. చంద్రబాబులా దళారులను పెట్టి దోచుకోలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టింది చంద్రబాబేనని బొత్స అన్నారు.