Bomb Threat Call: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కాల్.. పోలీసుల అదుపులో నిందితుడు
శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయాని (Rajiv Gandhi Airport)కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతుకుడు తెలిపాడు. హైదరాబాద్ - చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు.
- By Gopichand Published Date - 05:28 PM, Mon - 20 February 23

శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయాని (Rajiv Gandhi Airport)కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతుకుడు తెలిపాడు. హైదరాబాద్ – చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: IPS Vs IAS: సింధూరి, రూప ‘సోషల్’ వార్.. షాక్ ఇచ్చిన ‘కర్ణాటక హోం మంత్రి’
దీంతో ఎయిర్ పోర్టులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయంలో ఎలాంటి బాంబును గుర్తించలేదని వెల్లడించారు. అయితే బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అజ్మీరా భద్రయ్యగా నిర్దారించి.. అతడిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయానికి భద్రయ్య ఆలస్యంగా రావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆయనను అనుమతించలేదు. దీంతో ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.