2 Killed : ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి
ఢిల్లీలోని బవానా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘనటలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు
- Author : Prasad
Date : 20-09-2023 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలోని బవానా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘనటలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులను ఆగ్రా నివాసి సంజీవ్ (28), ఢిల్లీలోని నాంగ్లోయ్‌కు చెందిన సోను (40) మృతి చెందారు. క్షతగాత్రులు ఉషా (40), భాను, హర్వీర్, అశోక్‌గా గుర్తించారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు సాయంత్రం 4.44 గంటలకు కాల్ వచ్చిందని, ఆరు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చామని తెలిపారు. ఫ్యాక్టరీలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉన్నట్లు ఫైర్ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో.. ఫ్యాక్టరీని ముఖేష్ అనే వ్యక్తి నడుపుతున్నాడని.. ఈ ఫ్యాక్టరీలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు.ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురు కార్మికులు పనిచేస్తున్నారని..ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.